Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (11:19 IST)
భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం అమితమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రంగా "కల్కి 2898 ఏడీ". నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పఠానీ హీరోయిన్లుగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ తారాగాణం ఇందులో నటించారు. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో రూపొందించారు. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ విడుదల చేస్తోంది. 
 
ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేసి నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. 'బాహుబలి'తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ ఈ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ కావడం ఖాయమని చిత్ర బృందం చెబుతోంది. 
 
జనవరి తర్వాత బాక్సాఫీస్‌ వద్ద భారీ చిత్రాలేవీ సందడి చేయలేదు. వేసవి కాలమంతా చిన్న, మధ్యస్థాయి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ‘కల్కి’ వంటి విజువల్‌ వండర్‌ వస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు, బుక్‌మైషో‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఈ సినిమా కోసం అనేక మంది టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. దీంతో కేవలం ఒక్క గంట వ్యవధిలో 80 మిలియన్ టిక్కెట్లు అమ్ముడు పోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments