Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

Director Nag Ashwin

డీవీ

, గురువారం, 20 జూన్ 2024 (17:49 IST)
Director Nag Ashwin
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన 'భైరవ అంథమ్' ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది.  ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD  మరింత క్యురియాసిటీ పెంచింది. ఈ రోజు మేకర్స్ వరల్డ్ ఆఫ్ కల్కి 2898 AD - ఎపిసోడ్ 2 ని రిలీజ్ చేశారు.  
 
వరల్డ్ ఆఫ్ కల్కి 2898 AD - ఎపిసోడ్ 2లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ స్టార్ట్ చేశాం. కలియుగం ఎండింగ్ లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ వుంటే ఎలా వుంటుంది, నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రస్టింగా వుంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. కాశీని బిల్డ్ చేయడం వెరీ లాంగ్ ప్రాసెస్.
 
కాశీపైన పిరమిడ్‌ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ వుంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్‌ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్, ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా వుంది. అదే  శంబాల. ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్ గా వుంటుంది. కాశీకి కాంప్లెక్స్‌ కి సంబంధం లేని థర్డ్ వరల్డ్. ఈ వరల్డ్ వున్న వారు కాంప్లెక్స్‌ లో వున్నవారిని ఛాలెంజ్ చేస్తుంటారు. ఈ వరల్డ్ లో గాడ్ అనే ఐడియా వుండదు. గాడ్ ని బ్యాన్ చేసి వరల్డ్. ఈ మూడు వరల్డ్స్ మధ్య మన కథ నడుస్తుంది. ఒకొక్క వరల్డ్ ని ఒకొక్క థాట్ ప్రాసెస్ తో డిజైన్ చేశాం. కాశీలో ప్రజలు, వెహికిల్స్, కరెన్సీ, ఫుడ్, వెపన్స్ ఒకలా వుంటాయి. కాంప్లెక్స్‌లో ఒకలా వుంటాయి. శంబాలా కంప్లీట్ డిఫరెంట్. ఒకొక్కరు ఒక్కో కల్చర్. శంబాలా లో దేవుడు మళ్ళీ పుడతాడనే ఒక బిలిఫ్ వుంది. కల్కి అవతారం శంబాలా లో పుడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్ లో వుంది. ఈ మూడు వరల్డ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది' అన్నారు  
 
'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్  2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం