Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (09:50 IST)
అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణెలు కలిసి నటించిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ బ్యానరుపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫలితంగా ఈ చిత్రం విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. 
 
పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎక్స్(ట్విటర్ వేదికగా పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ మూవీ వారంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో కల్కి చిత్రం వసూళ్లపై ప్రభాస్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు.
 
అగ్ర తారలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితర భారీ తారాగణం నటించిన ఈ చిత్రంపై అన్ని చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ బాబు, అల్లు అర్జున్ తదితరులు 'కల్కి' ఓ అద్భుతమని పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య ఉన్న యాక్షన్ సన్నివేశాలు, విజువల్ వండర్ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ చిత్రంతో పురాణాలను భాగం చేయడంతో కర్ణుడికి సంబంధించి చరిత్ర విశేషాల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక 'కల్కి' చూసినవాళ్లు.. పార్ట్-2పై ఎప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments