Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ తుదిదశలో భిన్నమైన కలియుగం పట్టణం

డీవీ
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (13:25 IST)
Vishwa Karthikeya - Ayushi Patel
నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణం’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
 
టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొదించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు.  45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశామని, అందుకు సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పారు నిర్మాత.
 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.
 
ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
 నటీనటులు :  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్,  చిత్రా శుక్లా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments