Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్ పాత్రలో నటి కాజోల్... రజినీ అల్లుడు ధనుష్ విఐపి2లో...

కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ఖాన్‌ల జోడి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూసేవారు. కాజోల్‌కు వేలమంది అభిమానులే ఉన్నారు. అయితే కాజోల్, అజయ్ దేవగన్‌ని వివాహం చేసుకున్న తరువాత మెల్లగా సిని

Webdunia
గురువారం, 13 జులై 2017 (18:42 IST)
కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ఖాన్‌ల జోడి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూసేవారు. కాజోల్‌కు వేలమంది అభిమానులే ఉన్నారు. అయితే కాజోల్, అజయ్ దేవగన్‌ని వివాహం చేసుకున్న తరువాత మెల్లగా సినిమాలకు దూరమైపోయారు. బుల్లితెరలో అవకాశం వచ్చినా నటించలేదు. హిందీలో అత్త క్యారెక్టర్లు వచ్చినా చేయలేదు. హీరోయిన్లకు అక్కగా చేయమన్నా చేయలేదు. ఎంత క్లోజ్ డైరెక్టర్లు చెప్పినా కాజోల్ మాత్రం సినిమాల్లో నటించడం కొన్ని రోజుల వరకు స్టాప్ చేసింది.
 
అయితే చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ కాజోల్ సినిమాల్లోకి వస్తోంది. అది కూడా హిందీలో కాదు. ఏకంగా తమిళ, తెలుగు బాషల్లో. సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ చిత్రంలో కనిపించనున్నారు కాజోల్. రఘువరన్ బిటెక్ పేరుతో తెలుగులో విడుదలై ఈ సినిమా విడుదల సాధించింది. తమిళంలో అయితే విఐపి పేరుతో విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరువాత రెండవ భాగం చిత్రించాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అదే విఐపి-2. ప్రస్తుతం ఆ సినిమాలో విలన్‌గా నటించారు కాజోల్. పవర్‌ఫుల్ క్యారెక్టర్లో కాజోల్ చాలా రోజుల తరువాత కనిపించనున్నారు. 
 
ధనుష్ రాసిన ఈ సినిమా కథకు విలన్‌గా ఎవరు సరిపోతారని చూస్తుంటే కాజోల్ కరెక్టుగా ఉంటారని అనుకున్నారట. అందుకే స్వయంగా ధనుష్ వెళ్ళి కాజోల్‌ను ఒప్పించారట. ఇప్పటికే ఆ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఇక విడుదల అవ్వడమే ఆలస్యం. కాజోల్ నటించిన ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికే ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments