Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ కోసం రూ.లక్షలు ధారపోసిన కాజల్... (video)

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (13:13 IST)
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత నెల 30వ తేదీన ఓ ఇంటికి కోడలైంది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ నుంచే తమ సుఖసంసార జీవితాన్ని మొదలుపెట్టారు. ఇందుకోసం ఆమె ఏకంగా ఓ ప్రైవేట్ రిసార్టును ఏకంగా వారం రోజుల పాటు అద్దెకు తీసుకున్నారు. 
 
ఓ వారం రోజుల పాటు ఎంజాయ్ చేసింది. ఈ ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, రోజుకో రకమైన ఫోటో విడుదల చేస్తూ అబ్బో అనిపించింది. ముఖ్యంగా ముందు రోజు బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలు విడుదల చేసింది. ఆ తర్వాత రోజు ఏకంగా అండర్ వాటర్‌లో ఉన్న ఫోటోలు విడుదల చేసింది.
 
ఏకంగా అక్కడ ఓ బెడ్ వేసుకుని.. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇవన్నీ చూసిన తర్వాత కాజల్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా తన హనీమూన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'మీ హనీమూన్ చేపలు రెండు కళ్లు తెరుచుకుని మరీ చూస్తున్నాయి కాజల్' అంటూ సరదా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తన హనీమూన్ కోసం కాజల్ ఏకంగా లక్షలాది రూపాయలను ధారపోసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. హనీమూన్ కోసం కాజల్ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 40 లక్షలు. అవును.. వారం రోజుల కోసం ఈ జంట ఈ మొత్తాన్ని ఖర్చు చేశారట.
 
మాల్దీవుల్లో హనీమూన్ జరుపుకోవాలంటే ఆ రేంజ్‌లోనే ఖర్చు చేయాల్సివుంటుంది. ఎందుకంటే మాల్దీవ్స్ అంటే భూతల స్వర్గం మరి. అక్కడ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు అలలు.. వాటితో పోటీపడే అందాల భామల సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఇవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో తమ హనీమూన్ గడపాలంటే లక్షలు పోయాల్సిందే. ఇప్పుడు కాజల్ కూడా ఇదే చేసింది. పైగా, ఈ మొత్తంతో చిన్నపాటి సినిమాను కూడా నిర్మించవచ్చని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments