Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ - మను చరిత్ర నుంచి ‘హఠాత్తుగా’ పాట ఆవిష్క‌రించిన వర్మ

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (18:42 IST)
Manu Charithra team with varma
కాజల్ అగర్వాల్ సమర్పకురాలిగా  శివ కందుకూరి  హీరోగా న‌టించిన ‘మను చరిత్ర’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు  జోరందుకున్నాయి. నేడు ఈ చిత్రం నుంచి రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా హఠాత్తుగా అనే పాట విడుదలైంది.
 
బ్రేకప్ అనంతరం వచ్చే ఈ పాటలో ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో ఫెయిల్ అయితే వచ్చే కోపం, బాధ, ఆ విషాదం, ఎమోషన్ అంతా కూడా పాటలో కనిపిస్తోంది. గోపీ సుందర్ సిట్యువేషన్‌కు తగ్గట్టుగా మంచి బాణీని అందించారు. రేవంత్ గాత్రం చక్కగా సరిపోయింది. సిరా శ్రీ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
 
భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శివ కందుకూరి సరసన.. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యన్. శ్రీనివాసరెడ్డి, రాన్ సన్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ శ్రీ వాత్సవ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
 
వరంగల్ నేపథ్యంలో రాబోతోన్నో ఇంటెన్స్ లవ్ స్టోరీయే మను చరిత్ర. సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు విశేషమైన స్పందన లభించింది.
 
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధు నందన్, రఘు, దేవీ శ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షి, గరిమ, లజ్జ శివ, కరణ్, గడ్డం శివ, ప్రదీప్
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments