నిప్పుతో ఆటలాడిన స్టార్ హీరోయిన్...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:25 IST)
నేటి తరం హీరోయిన్లు కూడా హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా స్టంట్స్, ఇంకా ఫైటింగ్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు. హెవీ బైక్స్ నడపడం, రిస్కీ షాట్లలో నటించడం వంటి మామూలైపోయాయి. ఇలాంటి విన్యాసాలనే చేస్తూ ఒక టాలీవుడ్ హీరోయిన్ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.
 
ఆమె మరెవరో కాదు, కాజల్ అగర్వాల్.. ఈ వీడియోలో కాజల్ ఫైర్ అక్రోబాట్స్ విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఇది చూసిన అభిమానులు కాజల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో కాజల్ చీరలో అందంగా ముస్తాబయి ఉండటం, వెనక డాన్సర్లు కనిపించడం చూస్తుంటే, ఏదో సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఈ విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఏ మూవీ షూటింగ్ అనేది ఆమె వెల్లడించకపోయినా తమిళ మూవీ 'కోమలి' షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నందున ఆ ప్రదేశమే అయ్యుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సీత', తమిళంలో 'కోమలి', 'పారిస్ పారిస్' అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments