Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రజనీకి భారతరత్న": మహారాష్ట్ర భూషణ్ కూడా ఇవ్వండి ఫడ్నవీస్ గారూ.. అనిల్ గోటె విజ్ఞప్తి!!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ''కబాలి'' సినిమాకు నెగటివ్ రివ్యూలొచ్చినా.. కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రజనీ కాంత్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ

Webdunia
గురువారం, 28 జులై 2016 (14:13 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ''కబాలి'' సినిమాకు నెగటివ్ రివ్యూలొచ్చినా.. కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రజనీ కాంత్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ప్రతిపాదించడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మహారాష్ట్రలో ప్రారంభమైన రజనీకాంత్ బస్సు కండెక్టర్ ప్రయాణం.. ఆపై తమిళ సినీ ఇండస్ట్రీలో తలైవాగా స్థిరపడి.. ప్రస్తుతం ప్రపంచ దేశాలంతటా జర్నీ చేస్తోంది. కబాలి ద్వారా ప్రపంచ దేశాల్లో రజనీ మేనియా ఏవిధంగా ఉందో దీన్నిబట్టే అర్థమవుతుంది. 
 
ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ కోసం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు రజనీకాంత్ పేరును అనిల్ గోటే ఇప్పటికే ప్రతిపాదించారు. రజనీ కాంత్ అభిమానులకు దేవుడితో సమానమన్నారు. కబాలికి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని కొనియాడారు 
 
అంతేగాకుండా మహారాష్ట్ర భూషణ్‌తో పాటు భారతరత్నను కూడా రజనీ కాంత్‌కు ఇప్పించే ప్రయత్నం చేయాలని అనిల్ గోటే ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఇంకా ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు, విజ్ఞప్తి చేయాలని అనిల్ గోటె కోరారు. ఇంకా రజనీకాంత్‌కు మహారాష్ట్ర భూషణ్, భారత రత్న అవార్డులకు సిఫార్సు చేయడంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.
 
ఇకపోతే కబాలి రివ్యూకు నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన కబాలి త్వరలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అంటున్నారు. రజనీకాంత్, రాధికా ఆప్టే నటించిన ఈ సినిమా తొలి రోజే భారత్‌లో రూ.48.95 కోట్లు సంపాదించింది. తద్వారా సల్మాన్ ఖాన్ సుల్తాన్ రికార్డును బ్రేక్ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments