విజయ్ సేతుపతి ''జుంగా'' ట్రైలర్.. ఇలా వుంది.. మీరే చూడండి (వీడియో)

మెగాస్టార్ ''సైరా''లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న కోలీవుడ్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ''జుంగా'' అనే సినిమాతో తెరపైకి రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. తమిళంలో కమల్, విక్రమ్, సూర్

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (18:43 IST)
మెగాస్టార్ ''సైరా''లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న కోలీవుడ్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ''జుంగా'' అనే సినిమాతో తెరపైకి రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. తమిళంలో కమల్, విక్రమ్, సూర్య తర్వాత విభిన్నమైన రోల్స్ పోషించే విజయ్ సేతుపతి, గోకుల్ దర్శకత్వం వహించిన జుంగాలో డాన్‌గా నటించాడు. 
 
ఈ సినిమా కామెడీ కలగలిపిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ అని ట్రైలర్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొత్త లుక్‌లో కనిపించాడు. తరచూ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో కనిపించే విజయ్ సేతుపతి.. ఈసారి కోట్ సూట్‌లో విదేశీ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ సినిమాలో కనిపిస్తున్నాడు. 
 
ఇక ఈ చిత్రంలో సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. విదేశీ లొకేషన్లు, అక్కడి భారీ ఛేజింగ్స్, డైలాగ్స్ బాగున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఇంకేముంది.. ''జుంగా'' ట్రైలర్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments