Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి స్నేహితుడు ఓబయ్య ఎవరు? "సైరా" తొలి షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. అమితాబ్‌బచ్చన్, నయనతార, ‘సుదీప్‌’ వంటి భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్య

Advertiesment
Chiranjeevi
, మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:17 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. అమితాబ్‌బచ్చన్, నయనతార, ‘సుదీప్‌’ వంటి భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ షెడ్యూల్‌ కోసం లండన్‌ నుంచి చాలామంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లను పిలిపించారు. 'ఫస్ట్‌ షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు తీశాం. చాలా బాగా వచ్చాయి' అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 
 
అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తూ వ‌స్తున్న‌ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'సైరా' డిసెంబ‌ర్ 6న‌ సెట్స్ పైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. చిరు కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జ‌రుపుకోగా, సోమవారంతో తొలి షెడ్యూల్ పూర్తి అయింది. స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. చిరుపై కీల‌క సన్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌త్యేక సెట్‌లో రూపొందించిన‌ పోరాటస‌న్నివేశాలు అత్య‌ద్భుతంగా రావ‌డంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. 
 
ఇక రెండో షెడ్యూల్‌ని సంక్రాంతి త‌ర్వాత మొద‌లు పెడ‌తార‌ని టాక్‌. సైరా తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం రూపొందుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
మరోవైపు, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితచరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి'గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో బ్రిటీష్‌ వాళ్లపై సమర శంఖారావం పూరించి ప్రాణాలు అర్పిస్తారు. అయితే, తెల్లవాళ్లను తరిమి కొట్టాలంటే అనుచరుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ అనుచరుల్లో ముఖ్యమైనవాడు, నమ్మినబంటు, తన కుడి భుజం ‘ఓబయ్య’ అంటాడు నరసింహారెడ్డి. ఈ ఓబయ్య పాత్రను తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పోషించనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కథలో ఇది చాలా కీలకమైన పాత్ర అట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డికి తర్వాత మేమే.. చిరుతో సమస్యలొచ్చాయ్: అల్లు అరవింద్