Webdunia - Bharat's app for daily news and videos

Install App

'2403 ఫీట్' పేరుతో వెండితెర దృశ్యకావ్యంగా కేరళ కన్నీటిగాథ

ఇటీవల కేరళ రాష్ట్రంపై వరుణుడు ప్రకోపించి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ప్రకృతి ప్రకోపానికి కేరళ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు తగ్గడంతో కేరళ కొంతమేరకు కుదుటపడింది. కానీ, లక్షలమాది

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:30 IST)
ఇటీవల కేరళ రాష్ట్రంపై వరుణుడు ప్రకోపించి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ప్రకృతి ప్రకోపానికి కేరళ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు తగ్గడంతో కేరళ కొంతమేరకు కుదుటపడింది. కానీ, లక్షలమాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు భారీ మొత్తంలో విరాళాలు అందించారు.
 
ఇప్పుడు వ‌ర‌ద‌ల వ‌ల‌న కేర‌ళ రాష్ట్రంలో ఎంత బీభత్సం జ‌రిగింద‌నేది వెండితెర‌పై చూపించేందుకు మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జూడ్ ఆంటోని జోసెఫ్ ముందుకొచ్చారు. కొన్ని స్వ‌చ్చంద సేవాసంస్థ‌లు వ‌ర‌ద‌లపై ఇన్‌స్పైరింగ్ వీడియో చేయ‌మ‌ని ఆయ‌న‌ని సంప్ర‌దించ‌గా, సినిమా తీస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న త‌న‌కు వ‌చ్చింద‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. తర్వాత తరాలకు ఎన్నో ప్రేరణ తెప్పించే కథలను ఈ వరదల నేపథ్యంలో చెప్పాలి అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అయితే, బాధితుల సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ నా దృష్టిలో సూపర్‌ హీరోలే. ఈ చిత్రానికి చాలా గ్రాఫిక్స్ పని ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని దర్శకుడు తెలిపారు. వరదల నేపథ్యంలో తీయబోయ్యే సినిమాకు '2043 ఫీట్' అనే పేరును పెట్టనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఈ చిత్రంలో వ‌ర‌ద నీరు చూట్టూ పొంచి ఉండటం, స‌రైన వ‌స‌తి లేక ఇబ్బందులు ప‌డ్డ ప‌రిస్థితులు, కాపాడే వారు లేని స‌మ‌యంలో వారు ప‌డిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల‌ని ప్ర‌ధానంగా చూపించ‌నున్న‌ట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments