నిన్న "సైరా".. నేడు "అరవింద సమేత.."కు తప్పని లీకుల గోల...

నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Webdunia
సోమవారం, 30 జులై 2018 (09:29 IST)
నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ స్టిల్స్ తాజాగా లీకయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత..' చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి.
 
నిజానికి ఈ లీక్స్‌ను కట్టడి చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సెట్స్‌లోకి ఎవరు సెల్ తీసుకురావద్దని హుకుం జారీ చేశాడు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. ఇలా ఆంక్షలు విధించిన కొన్ని రోజుల్లోనే మరో సీన్స్ లీక్ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఎన్టీఆర్ రాయలసీమ యువకుడి గెటప్ సెట్స్ నుంచి లీక్ అయింది. వైట్ కలర్ కుర్తా, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్న ఎన్టీఆర్ సింపుల్‌గా కనిపిస్తూ, సీరియస్‌గా నడుస్తున్న లుక్‌లో ఫోటో ఎలా లీక్ అయిందో తెలియదుగాని.. సోషల్ మీడియాలో ఈ ఫోటో హల్చల్ చేస్తోంది. 
 
చాలాకాలం తర్వాత ఎన్టీఆర్ రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉండటంతో పాటు మధ్యమధ్యలో ఇలాంటి లీక్‌ల వల్ల సినిమాకు మరింత హైప్ వస్తోంది. కాగా, దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments