జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం రూ.100 కోట్లా?

Webdunia
గురువారం, 11 మే 2023 (12:07 IST)
టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో ఆయన ఒక్కో చిత్రానికి తీసుకునే పారితోషికంపై ఇపుడు తెగ చర్చ సాగుతోంది. ఒక్క చిత్రానికి అక్షరాలా రూ.45 కోట్లు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. అయితే, ఈ చిత్రానికి ఎన్టీఆర్ కేవలం తన ఒక్కటి పారితోషికాన్నే దాదాపుగా రూ.70 కోట్ల వరకూ తీసుకొంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు బాలీపుడ్‌లో 'వార్ 2' సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఈ చిత్రం కోసం హృతిక్ రోషన్‌తో కలిసి వెండి తెర పంచుకోబోతున్నాడు. మరి ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఎంత అందుకొంటున్నాడన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 'వార్ ?'. భారీ యాక్షన్ చిత్రం. ఈ మల్టీస్టారర్ చిత్రం. అదేసమయంలో పాన్ ఇండియా మూవీ కూడా. సో.. కొరటాల సినిమాకు అందుకొన్నదానికంటే ఎక్కువే తీసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. 
 
ఎన్టీఆర్ ఈ చిత్రానికి రూ.35 కోట్లు తీసుకొంటున్నాడట. అక్కడితో ఆగడం లేదు. లాభాలలో సైతం వాటా అందుకొంటున్నట్టు సమాచారం. ఈ సినిమా హిట్ కొట్టి, అనుకొన్నంత స్థాయిలో బిజినెస్ జరిగితే అటూ ఇటుగా రూ.100 కోట్లయినా వస్తాయని మార్కెట్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అంటే ఎన్టీఆర్ పారితోషికం వంద కోట్లన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments