Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిల్లూ హీరోయిన్ అనుపమను ఘోరంగా అవమానించిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఐవీఆర్
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (10:41 IST)
టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇంకా చిత్ర బృందాన్ని అభినందించేందుకు వచ్చినవారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యువహీరో విశ్వక్ సేన్ తదితరులు కూడా వచ్చారు. చిత్రంలో నటించిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తనకు దక్కిన సక్సెస్ గురించి చెప్పేందుకు స్టేజిపైకి ఎక్కి మాట్లాడాలనుకున్నది.
 
ఐతే మైకు అందుకుని మాట్లాడుతూ వుండగా... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటూ గట్టిగా గావుకేకలు పెట్టారు. ఎన్టీఆర్ స్టేజిపైకి వచ్చి మాట్లాడాలంటూ గోల చేస్తుండటంతో అనుపమ స్టేజి దిగి వెళ్లిపోబోయింది. ఇంతలో యాంకర్ సుమ... రెండు ముక్కలైనా మాట్లాడాలని అభ్యర్థించడంతో మరోసారి పరమేశ్వరన్ మాట్లాడేందుకు ప్రయత్నించబోగా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరిచారు.
 
ఇక చేసేది లేక టిల్లు హీరోయిన్ ఖిన్నురాలై స్టేజి దిగి వెళ్లిపోయిందట. నేరుగా వెళ్లి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీర్వాదాలు తీసుకుని నోరు మెదపకుండా తన సీట్లో కూర్చుండిపోయిందట ఈ లేడికళ్ల సుందరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments