Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిల్లు స్క్వేర్ తో కల్చర్ గాడి తప్పుతుందా, సిద్దు అలరిస్తాడా?

Advertiesment
Anupama, siddu

డీవీ

, మంగళవారం, 26 మార్చి 2024 (16:48 IST)
Anupama, siddu
సిద్దు జొన్నలగడ్డ నటించిన  డీజే టిల్లు  2022 లో థియేటర్ల లో రిలీజ్ అయి యూత్ ను ఒక్కసారిగా ఆకట్టుకుంది. సాంప్రదాయపద్దతులు గల తండ్రి, అవి ఇప్పటికి పాతపడిపోయినవి చెప్పే కొడుకు మధ్య జరిగే కథతోపాటు మర్డర్ ఓ అంశంగా తీసుకుని తీశారు. ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశాడు సిద్దు. ఇప్పుడు సీక్వెల్ కూడా మూడు రోజుల్లో రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు దర్శకుడు, హీరోకు మధ్య విభేదాలున్నాయని కథనాలు కూడా వచ్చాయి.
 
అలాంటివి ఏమీ లేవనీ. కథ ప్రకారం తను చేయాల్సింది చేశాడు అని దర్శకుడు డైరెక్టర్ మల్లిక్ రామ్ తెలియజేశాడు. మొదటి భాగంలో సినిమా ద్వారా దర్శకుడికంటే హీరోకే పేరు వచ్చింది. దానికి ఆయన ఎవరికి పేరు వచ్చినా ఓకే అనేవిధంగా మాట్లాడాడు. 
 
ఇదిలా వుండగా, టిల్లు స్వేర్ లో టిల్లు చిత్రానికి మించి సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఇప్పటి కల్చర్ పేరుతో రకరకాలుగా కొత్త పోకడలు తీసుకురావడం, కోట్లాదిమంది మైండ్ లో కొత్త కాన్సెప్ట్ లు ఎక్కించడం ఎంతవరకు సబబు? అనేది ప్రశ్నగా మారింది. మనకు తెలీకుండా బయట చాలా ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు సీక్వెల్ లో హీరో, దర్శకుడు చూపించబోతున్నారు. పాష్ కల్చర్ పేరుతో లేడీస్ ఎక్కువగా ఎక్సపోజ్ చేయడం, బూతులు మాట్లాడటం, బాష కూడా విదేశీ కల్చర్ కు అనుగుణం గా ఉండటం అనేవి కేవలం అక్కడివారిని బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారని తరచూ దర్శక నిర్మాతలు చెపుతున్నారు. మరి ఈ పోకడ ఎంత దూరం పోతుందే ప్రేక్షకులే తీర్పు చెప్పాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య పెట్టిన షరతులన్నీ ఒప్పుకునే లవ్ గురు : విజయ్ ఆంటోనీ