Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సహనటుడు, మా అన్నయ్య, నా స్నేహితుడు చెర్రీకి థ్యాంక్స్!

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (18:53 IST)
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ హిట్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోయింది. 
 
దాంతో తారక్‌కి హిందీ సినిమా వార్ 2లో విలన్ రోల్ దక్కింది. అలాగే హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోగా, ఎన్టీఆర్‌కు అవార్డు లభించింది.
 
తాజాగా SIIMA అవార్డులు ప్రతిష్టాత్మక చలనచిత్ర అవార్డులలో ఒకటి. దుబాయ్‌లో జరిగిన SIIMA 2023 (11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అందుకోసం దుబాయ్ వెళ్లాడు. RRR చిత్రానికి గాను తారక్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ "నాపై మళ్లీ మళ్లీ నమ్మకం ఉంచిన జక్కన్నకు కృతజ్ఞతలు" అన్నారు. తర్వాత తారక్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 
 
"ఈ సినిమాలో నటించిన నా సహనటుడు, మా అన్నయ్య, నా స్నేహితుడు రామ్‌చరణ్‌కి ధన్యవాదాలు. ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి పునాదిలా సపోర్ట్‌ చేశారు" అని తారక్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments