Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై మ‌ళ్లీ ఎంట్రీ ఇవ్వ‌నున్న ఎన్టీఆర్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న బిగ్ బాస్ సీజ‌న్ 2 నుంచి త‌ప్పుకున్నాడు కదా..! మ‌రి.. ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజంగా నిజం. కాక‌పోతే హాస్ట్‌గా కాదండి.. యాంక‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఇం

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (13:56 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న బిగ్ బాస్ సీజ‌న్ 2 నుంచి త‌ప్పుకున్నాడు కదా..! మ‌రి.. ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజంగా నిజం. కాక‌పోతే హాస్ట్‌గా కాదండి.. యాంక‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... పది సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ డ్యాన్సర్స్‌కి ఎంతో స్పూర్తి క‌లిగిస్తోన్న‌ రియాలిటీ షో ఢీ. ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఈ షోకి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్.
 
గంత కొంత‌కాలంగా అల‌రిస్తోన్న డ్యాన్స్ షో ఢీ 10 చివరకు వచ్చింది. త్వరలో ఫైనల్స్ టెలికాస్ట్ కానున్నాయి. ప్రస్తుతం ఆ ఢీ10 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. దీనికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా చేస్తాడో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. యంగ్ డ్యాన్స‌ర్స్‌ను ఎంకరేజ్ చేయడం కోసం ఎన్టీఆర్ ఈ షోకి గెస్ట్‌గా వెళ్లార‌ట‌. బిగ్ బాస్ 2లో ఎన్టీఆర్‌ని మిస్ అయ్యాం అనుకునేవాళ్లు ఇలా డ్యాన్స్ షో ద్వారా బుల్లితెర పైకి వ‌స్తుండ‌టంతో ఎప్పుడెప్పుడు ఈ షో ప్ర‌సారం కానుందా అని ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments