Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" తర్వాత సోలో మూవీ.. కాస్త భయంగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (10:49 IST)
"ఆర్ఆర్ఆర్" వంటి భారీ హిట్ చిత్రం తర్వాత తాను సోలో హీరోగా నటించిన "దేవర" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, అందుకే కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్టు హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పైగా, ఈ చిత్రం కోసం తాను కూడా ప్రేక్షకుల తరహాలోనే అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని చెప్పారు. 
 
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన "దేవర" చిత్రం ట్రైలర్‌ను సోమవారం ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'దేవర విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. సముద్ర జలాల అడుగున చిత్రీకరణ చేశాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది' అన్నారు. 
 
శివ కొరటాల మాట్లాడుతూ 'సెట్స్‌లో ఒక్కసారి కెమెరా ఆన్ అయిందంటే ఎన్టీఆర్ సర్వం మర్చిపోయి పాత్రలో లీనమై నటిస్తాడు. అప్పట్లో సీనియర్ ఎన్టీ ఆర్-శ్రీదేవిలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జోడీ బాగుందని ప్రేక్షకులకు మెచ్చుకుంటున్నారు' అని చెప్పారు. 
 
జాన్వీకపూర్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్‌తో కలసి నటించాలనే నా కోరిక 'దేవరతో తీరింది. ఆయనకు నేను పెద్ద అభిమానిని ఎన్టీఆర్ నుంచి నటనకు సంబంధించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను.. నేర్చుకున్నాను' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments