Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పేందుకు ఏముంది మీ గొప్పా.. చేసేందుకు ఏముంది గోల తప్పా...

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే, మాతృభాషను విస్మరించవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు పలువురు మద్దతు ప్రకటించారు. అలాంటి వారిలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావులు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి జొన్నవిత్తుల ఓ కవిత రాశారు. ఆ పాట రూపంలో పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. అమ్మ భాష కోసం ఎవడున్నాడప్పా... పవన్ కల్యాణ్ ఒక్కడే కనిపించాడప్పా అంటూ రాగయుక్తంగా ఆయన ఓ గీతం ఆలాపించారు.
 
చెప్పేందుకు ఏముందీ మీ గొప్ప... చేసేందుకు ఏముందీ మీ గోల తప్పా అంటూ ఆయన రూపొందించిన పాట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఇంగ్లీషు మీడియం అంశం నేపథ్యంలో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలే జొన్నవిత్తుల అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. 

 

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments