జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

దేవీ
బుధవారం, 19 నవంబరు 2025 (18:17 IST)
Sudigali Sudheer, Divya Bharathi
జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో... క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా మూవీ G.O.A.T . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది.  
 
ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ లాంచ్ చేశారు.
 
లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సురేష్ బనిసెట్టి లిరిక్స్ హీరో ఎమోషన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి.
 
ఈ సాంగ్ లో సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి. ఈ లవ్ ట్రాక్ అందరికీ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. ఈ ఆల్బమ్ పై అంచనాలని మరింతగా పెంచింది.
 
త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
నటీనటులు: సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments