Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

Advertiesment
Sudigali Sudheer, Natasha Singh, Naksha Sharan, Akshara Gowda Clap by vinayak

చిత్రాసేన్

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (18:20 IST)
Sudigali Sudheer, Natasha Singh, Naksha Sharan, Akshara Gowda Clap by vinayak
సుడిగాలి సుధీర్  కథానాయకుడిగా 5వ సినిమా నేడు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు షాట్ కు వివి వినాయక్ క్లాప్ కొట్టారు. హీరో నిఖిల్ టైటిల్ ను రిలీవ్ చేశారు. హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.
 
టైటిల్ లోగోను ఓడ ఆకారంలో డిజైన్ చేసి ‘S’ అక్షరాన్ని వారాహి అమ్మవారి పాదంతో చూపించారు. చేతిలో ఆయుధం పట్టిన అమ్మవారు కనిపిస్తారు. టైటిల్ పోస్టర్‌కు మైథలాజికల్, రూరల్ టచ్ ఇచ్చారు. బంగారు పాదసరాలు, మేత్తెలతో అలంకరించిన కాలు, పెద్ద పచ్చ ఆకు మీద అడుగు వేస్తూ కనిపిస్తుంది. ఆ ఆకుపై వేపుడు కోడి, మేక తలలు, అన్నం, పూలు, సింధూరంతో కూడిన బ్యాక్ డ్రాప్ ఉంటుంది. దాని పక్కన రక్తం తడిసిన ఖడ్గం ఉండటం, దేవతా శక్తి, త్యాగం, ఘర్షణలకు సంకేతంగా నిలుస్తుంది. ఈ పోస్టర్‌నే చూసి కథ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో అర్థమవుతుంది.
 
ఈ చిత్రం స్క్రిప్ట్‌ను బన్నీ వాసు అందజేశారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేశ్ కెమెరాను ఆన్ చేయగా, ముహూర్తపు షాట్‌కు వి.వి. వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు ప్రసన్న కుమార్ స్వయంగా యాక్షన్ చెప్పారు.
 
ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
 
అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్,  ప్రొడక్షన్ డిజైనర్‌ బ్రహ్మ కడలి,   చింతా శ్రీనివాస్ రైటర్. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
 
అనంతరం సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, చాలా గ్రాండ్ గా నా సినిమాను నిర్మాతలు ప్రారంభించారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తానన్నారు. సుధీర్ కు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని హీరో నిఖిల్ ఆకాంక్షించారు.
తారాగణం: సుధీర్ ఆనంద్, శివాజీ, నటాషా సింగ్, నక్ష శరణ్, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్