Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (12:12 IST)
సినీ నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం సెన్సార్ రివైజింగ్ కమిటిలో సభ్యురాలిగా తాత్కాలికంగా ఆమెను పక్కన బెట్టాలని కోరారు. 
 
ఏపీలోని రాజకీయాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాం గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రమే 'వ్యూహం'. ఈ నెల పదో తేదీన విడుదలవుతుంది. ఈ క్రమంలో సెన్సార్‌కు వెళ్లారు. అయితే, ఈ చిత్రం రాజకీయ వివాదాలను సృష్టించేలా ఉందని సెన్సార్‌ బోర్డు పేర్కొంది. 
 
దీనిపై రివ్యూ కమిటీకి వెళ్లాలని సూచించింది. సంబంధిత కమిటీలో జీవిత సభ్యురాలిగా ఉన్నారు. దాంతో, ఆమె అధికార వైకాపాకు అనుకూలమని, రివ్యూ కమిటీలో ఈ చిత్రానికి పచ్చజెండా ఊపేస్తారంటూ నట్టి కుమార్ వంటి నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ సెన్సార్ రివైజింగ్ కమిటీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కన బెట్టాలంటూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై నటి జీవిత స్పందించారు. తనకు వైకాపాతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్‌ అవుతోన్న తన ఫొటోలు (పార్టీ కండువాతో వున్నవి) పాతవేనని స్పష్టంచేశారు. తన గురించి కొందరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
తాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నానని తెలిపారు. 'వ్యూహం' (అనే సినిమా ఆర్‌.సి (రివ్యూ కమిటీ)కి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే దాన్నీ చూస్తా. అయితే నాకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు' అని జీవిత వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments