Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో'' టీజర్ వచ్చేస్తోంది.. డార్లింగ్ కోసం జపాన్ యువతుల డ్యాన్స్ (video)

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (15:19 IST)
బాహుబలికి తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ''సాహో'' స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి జూన్ 13వ తేదీన ట్రైలర్ విడుదల కానుంది. 
 
హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించనున్నారు. 
 
ఇక ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీబడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేయడం ఈ సినిమాలో మరో ప్రత్యేకత. 
 
ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. "బాహుబ‌లి" సినిమా జపాన్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌కు జపాన్‌కు చెందిన యువ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందులోనూ అమ్మాయిల సంఖ్యే అధికం. ఆ సినిమా విడుదల సమయంలో ప్రభాస్, అనుష్కలు జపాన్‌కు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు జపాన్‌కు చెందిన యువతులు భారత్‌కు వచ్చారు. 
 
వారంతా ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో, ఆయన్ను కలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటికి వెళ్లారు. అయితే, సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా ప్రభాస్ వారిని కలుసుకోలేకపోయారు. అయితేనేం, తమ అభిమానాన్ని చూపుతూ వారంతా ప్రభాస్ ఇంటి గేటు ముందు నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments