పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్

ఠాగూర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (23:18 IST)
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ పుకార్లపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పెళ్లి చేసుకోమని స్పష్టంచేశారు. తాజాగా చేసిన ఈ ఒక్క మాటతో శిఖర్ పహారియాతో తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె ప్రస్తుతానికి తెరదించారు. 
 
వరుణ్ ధావన్‌‍తో కలిసి జాన్వీ నటిస్తున్న సమయంలో "సన్నీ సంస్కారి కీ తులసి కుమారి" సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమెను మీ పెళ్లి ఎపుడు అని ప్రశ్నించారు. దీనికి జాన్వీ ఏమాత్రం తడుముకోకుండా ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నటనపైనే ఉంది. పెళ్లికి ఇంకా సమయం ఉంది అని సమాధానమిచ్చారు. 
 
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్‌లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. పైగా, పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసే కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. గతంలో తన ఫోనులో స్పీడ్ డయల్ లిస్టులో తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్ తర్వాత శిఖర్ పహారియా పేరు ఉందని చెప్డం శిఖు అని రాసివున్న నెక్లెస్ ధరించడం వంటి సంఘటనలు ఈ వదంతులకు కారణమయ్యాయి. అయితే, తాజా ఈవెంట్‍లో శిఖర పేరును ప్రస్తావించనప్పటికీ పెళ్లి వార్తలపై జాన్వీ నేరుగా స్పందించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments