భార్య శ్రీదేవితో బోనీకపూర్... అచ్చుగుద్దినట్టుగానే అతిలోకసుందరి మైనపు బొమ్మ

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (12:48 IST)
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మైనపు బొమ్మ సిద్ధమైంది. దివంగత నటి శ్రీదేవికి నివాళిగా దీన్ని తయారు చేశారు. ప్రతిష్టాక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ బుధవారం సింగ‌పూర్‌లో శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీదేవి భ‌ర్త బోని క‌పూర్, ఆమె కూతుళ్ళు జాన్వీ క‌పూర్‌, ఖుషీ క‌పూర్ హాజ‌ర‌య్యారు. 
 
"మిస్ట‌ర్ ఇండియా" చిత్రంలోని హ‌వా హ‌వాయి సాంగ్‌లో శ్రీదేవి లుక్ మాదిరిగానే మైన‌పు విగ్ర‌హాన్ని త‌యారు చేశారు. జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి మైన‌పు విగ్ర‌హాన్ని చూస్తూ అలా ఉండిపోయింది. శ్రీదేవి మైన‌పు విగ్ర‌హం చూపరుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.
 
కాగా, బోనీకపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి 2018 సంవత్సరం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్ టబ్‌లో మునిగి కన్నుమూసిన విషయం తెల్సిందే. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించింది. ఇటీవ‌ల ఆమె జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు కుటుంబ స‌భ్యులు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments