Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై లవకుశ: ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ భయంకరంగా ఉంటుంది.. టైగర్.. భార్య వద్ద తిట్లు తిన్నాడా?

హాలీవుడ్ రేంజ్ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో టైగర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. మూడో హీరోయిన్ ఉందా.. అనేది ఇంకా తె

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (15:45 IST)
హాలీవుడ్ రేంజ్ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో టైగర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. మూడో హీరోయిన్ ఉందా.. అనేది ఇంకా తెలియరాలేదు. ట్రిపుల్ రోల్ కావడంతో విలన్ టైపు పాత్రను కూడా ఎన్టీఆరే పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
జై లవకుశకు దర్శకుడు బాబీ డైరక్షన్ పగ్గాలు చేపట్టారు. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మే 20న టైగర్  బర్త్ డేను పురస్కరించుకుని విడుదల కానుందని సమాచారం. ఈ లుక్‌పై ఇప్పుడే సోషల్ మీడియాలో వాడీవేడీగా చర్చ సాగుతోంది. ఫస్ట్ లుక్ క్రూరంగా, భయంకరంగా ఉంటుందని హాలీవుడ్ మేకప్ మెన్ వాన్స్ హర్ట్‌వెల్ ట్వీట్ చేయడంతో.. నందమూరి ఫ్యాన్స్ జై లవకుశ ఫస్ట్ లుక్ కోసం వేయి కనులతో వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలోనే టైగల్ వెరైటీ రోల్స్‌లో కనిపిస్తాడని.. ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుందని సినీ యూనిట్ అంటుంది.
 
ఇదిలా ఉంటే.. టైగర్ ఈ మధ్య భార్యతో బాగా తిట్టులు తిన్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేంటి.. టైగర్ లాంటి వ్యక్తి భార్య తిట్లు తిడుతుంటే పిల్లిలా మారిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ఘటనే తన విషయంలో జరిగిందని ఎప్పుడో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఓసారి అభయ్ (ఎన్టీఆర్-ప్రణతి కుమారుడు)ని స్నానం చేయించిన ఎన్టీఆర్ వద్ద ప్రణతి వదిలిపెట్టి వెళ్ళింది. 
 
ఆ సమయంలో ఎన్టీఆర్ కాళ్ల మధ్య పిల్లాడిని ఉంచి ఆడుకుంటుండగా.. జారిపడి పిల్లాడి తలకు గాయం తగిలింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రణతి నువ్వింతేనా.. కాసేపు పిల్లాడిని పట్టుకోమంటే ఇలా చేశావేంటి అంటూ తిట్టేసింది. దీంతో టైగర్ షాక్ తిన్నాడు. బాబు కోసం రెండు రోజుల పాటు ఆస్పత్రి వెంట తిరిగాడట. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments