Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలు పవన్ కల్యాణ్‌‌ను చాలా మార్చేశాయి... ఆశ్చర్యపోయా...: రాశి కామెంట్స్

అందాల "రాశి" గోకులంలో సీత సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 70కి మించిన సినిమాల్లో నటించిన రాశి... కల్యాణ్ వైభోగమే సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (15:25 IST)
అందాల "రాశి" గోకులంలో సీత సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 70కి మించిన సినిమాల్లో నటించిన రాశి... కల్యాణ్ వైభోగమే సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా లంక సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో రాశి ఉన్నట్టుండి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‍ను కలిసింది. దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడింది. అయితే ఈ భేటీ వెనుక రాశి లంక సినిమా ప్రమోషన్‌ వ్యవహారమే కారణమని సినీ పండితులు అంటున్నారు. కానీ రాశి మాత్రం మర్యాదక పూర్వంగానే కలిశానని చెప్తోంది. 
 
రాశి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ను కలిసిన వివరాలను చెప్పింది. గోకులంలో సీత సినిమాకు తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో పవన్ చాలా మారిపోయాడని.. చెప్పింది. గోకులంలో సీత టైమ్‌లో పవన్ అస్సలు తనతో మాట్లాడేవాడు కాదని, ఇప్పుడు మాత్రం ఏకధాటిగా మాట్లాడేస్తున్నాడని రాశి ఆశ్చర్యపోయింది.
 
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ చాలా మారిపోయాడని, అయితే వ్యక్తిగతంగా మాత్రం ఇప్పటికీ పవన్ చాలా మంచి మనిషని, అతనంటే చాలా ఇష్టమని అంటోంది. పవన్ పిలిస్తే రాజకీయాల్లోకి వెళ్తారా అనే ప్రశ్నకు మాత్రం రాశి సమాధానం దాటేసింది. తనకు రాజకీయాలంటే అస్సలు పడవని, ఈ విషయంలో పవన్ కోరినా తను సమాధానం చెప్పలేనని రాశి వెల్లడించింది. 
 
కాగా పెళ్లికి తర్వాత రాశి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల విరామం తర్వాత.. దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించిన ‘కల్యాణ వైభోగమే’ చిత్రం ద్వారా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లంక’ సినిమాలో రాశి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, భద్రత లేని సమాజం లంకతో సమానం అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు. 
 
పవన్ కల్యాణ్‌ను తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా కలిసేందుకు వెళ్లినట్టు చెప్పింది. కానీ అపాయింట్‌మెంట్ తీసుకోకపోవడంతో కాసేపు వేచివుండాల్సి వచ్చిందని.. కానీ ఈ విషయం తెలుసుకుని తనను పవన్ పిలిపించారని రాశి తెలిపింది. తన పాప తొలి బర్త్ డే వేడుకలకు పవన్‌ను ఆహ్వానించినట్లు రాశి చెప్పింది. పాపతో కలిసి పవన్‌ను కలిశానని.. పాపతో పవన్ కాసేపు ఆడుకున్నాడని రాశి చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments