Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ డా తంబీ.. 'జగమే తందిరమ్' ధనుష్‌కు రుస్సో బ్రదర్స్ విషెస్

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (11:12 IST)
Danush
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల శుభాకాంక్షలు అందాయి. ధనుష్‌.. లేటెస్ట్‌గా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా 'జగమే తందిరమ్‌'(జగమే తంత్రం)తో సందడి చేయబోతున్నాడు. ఈ తరుణంలో ది అవెంజర్స్ సిరీస్‌ని రూపొందించిన హాలీవుడ్‌ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్‌ ధనుష్‌కి గుడ్‌లక్‌ చెప్పారు.

ధనుష్ హాలీవుడ్‌లో 'ది గ్రేమ్యాన్‌'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. ఈ మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తోంది. 
 
ఈ సందర్భంగా వారు స్పందిస్తూ 'సూపర్‌ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్‌ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్‌కు గుడ్‌ లక్‌' అంటూ ట్రైలర్‌తో సహా ట్వీట్‌ చేశారు. దానికి ధనుష్‌ స్పందిస్తూ థ్యాంక్స్‌ చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్‌ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి. 
 
ఇదిలా ఉంటే జగమే తందిరం శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ కాబోతోంది. తమిళ్‌, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ అలరించనుంది. కాగా ధనుష్ పూర్తి వైవిద్యభరితమైన కథలని ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments