Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాపాయస్థితిలో 'జబర్దస్త్' టీం లీడర్‌... ఎవరు?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:39 IST)
ప్రముఖ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే హాస్య కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమంలో ఓ బృందానికి సారథ్యం వహిస్తూ వచ్చిన పంచ్ ప్రసాద్ ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈయనకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని నటుడు, ఆ కార్యక్రమ మాజీ వ్యాఖ్యాత నాగబాబుకు స్వయంగా పంచ్ ప్రసాద్ చెప్పి బోరున విలపించాడు. 
 
పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీలు 80 శాతం మేరకు పాడైపోయాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కించుకుంటున్నాడు. సర్జరీ చేయాల్సివుండగా, ఆర్థికస్తోమత లేనికారణంగా సర్జరీ కూడా ఇంకా చేయలేదు. ఈ విషయం తెలిసిన నాగబాబు.. మిగిలిన కమెడియన్స్‌ అంతా ముందుకువచ్చి, సహ నటుడుని కాపాడాల్సిందిగా కోరారు. 
 
కాగా, ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు పంచ్ ప్రసాద్‌కు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేశారట. కాగా, పంచ్ ప్రసాద్ 'పటాస్' షోలో అదిరిపోయే పంచ్‌లతో ప్రతి ఒక్కరినీ ఆలరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments