Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ముందు నుయ్యి… వెనుక గొయ్యి' .. ఇదీ మెగా బ్రదర్ నాగబాబు పరిస్థితి

మెగా సోదరుల్లో నాగబాబు ఒకరు. ఈయన పరిస్థితి ఇపుడు 'ముందు నుయ్యి… వెనుక గొయ్యి'లా తయారైంది. ఎందుకంటే, వాళ్ళూ వీళ్ళు వాదులాడుకొని తనను ఇరుకున పెట్టేస్తున్నారంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. దీనికి కా

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (20:28 IST)
మెగా సోదరుల్లో నాగబాబు ఒకరు. ఈయన పరిస్థితి ఇపుడు 'ముందు నుయ్యి… వెనుక గొయ్యి'లా తయారైంది. ఎందుకంటే, వాళ్ళూ వీళ్ళు వాదులాడుకొని తనను ఇరుకున పెట్టేస్తున్నారంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల ఓ తెలుగు చానెల్ వారసత్వ రాజకీయాలపై చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పవన్ వీరాభిమాని, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా పాల్గొన్నారు. వీరిద్దరూ వాగ్వివాదానికి దిగారు. అసభ్య పదజాలంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్‌పైనా రోజా విమర్శలు గుప్పించారు. ఈ తిట్ల పురాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఫలితంగా అది చినికి చినికి గాలీవానగా మారిపోయింది. 
 
దీంతో పవన్ అభిమానులు రోజాపై మండిపడుతూ, ఒంటికాలిపై లేస్తున్నారు. అంతేకాదు ఆమెతో కలసి నాగబాబు ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌లో పాల్గొనకూడదని ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మెగా బ్రదర్ ఉన్నారు. ఇదే అంశంపై తన సన్నిహితల వద్ద ఆయన వాపోయినట్టు సమాచారం. 
 
నిజానికి నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే, ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నటి రోజాతో కలసి చేస్తున్నారు. పైగా, టీఆర్పీలో ఇది రేటింగ్‌లో ఉంది. ఆ మధ్య రోజా కొన్ని ఎపిసోడ్స్‌కు డుమ్మా కొట్టినా… నాగబాబు మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ అభిమానుల కోరిక మేరకు నాగబాబు ఆ ప్రోగ్రామ్ నుండీ తప్పుకుంటాడా? లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments