Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ -7- హౌస్‌లో జబర్దస్త్ కమెడియన్ నరేష్?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (13:25 IST)
Jabardasth Naresh
రియాల్టీ షో- బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించడానికి త్వరలో రాబోతోంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో ఇప్పుడు ఏడో సీజన్‌తో రాబోతోంది. ఆరవ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
 
అయితే ఈసారి ఏడో సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. పోటీదారుల ఎంపిక విషయంలో నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడం మామూలే. 
 
ఈసారి కూడా 20 మంది కంటెస్టెంట్లు ఎంపిక కానున్నారు. ఇప్పటికే వీరి ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. అయితే వారి పేర్లను ఇంకా వెల్లడించలేదు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ నరేష్ ఈసారి బిగ్ బాస్ 7 తెలుగు హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశించబోతున్నాడని తెలుస్తోంది.
 
జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న నరేష్, ఈటీవీలోని శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో నటిస్తూ అలరిస్తున్నాడు. రీసెంట్‌గా చిరంజీవి, తమన్నా భాటియా జంటగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. 
 
త్వరలో బిగ్ బాస్-7 ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన స్టార్ మా ఛానెల్ నుండి వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మళ్లీ ఈ షోను నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments