Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనతా గ్యారేజ్'.. అది జనెటిక్ ప్రాబ్లమ్... అది నా ఫెయిల్యూరే : కొరటాల శివ

'జన‌తా గ్యారేజ్' సినిమాను అంద‌రూ బాగా ఆద‌రిస్తున్నార‌ని.. మొద‌టిరోజు క‌లెక్షన్లు.. 'శ్రీ‌మంతుడు' కంటే ఎక్కువ‌గా వచ్చాయ‌ని.. ఇదే నిద‌ర్శన‌మ‌ని ద‌ర్శకుడు కొర‌టాల శివ తెలిపారు. గురువారం విడుద‌లైన ఈ సినిమ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (18:58 IST)
'జన‌తా గ్యారేజ్' సినిమాను అంద‌రూ బాగా ఆద‌రిస్తున్నార‌ని.. మొద‌టిరోజు క‌లెక్షన్లు.. 'శ్రీ‌మంతుడు' కంటే ఎక్కువ‌గా వచ్చాయ‌ని.. ఇదే నిద‌ర్శన‌మ‌ని ద‌ర్శకుడు కొర‌టాల శివ తెలిపారు. గురువారం విడుద‌లైన ఈ సినిమా గురించి.. శుక్రవారం వివ‌రాల‌ను తెలిపేందుకు ఆయ‌న విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత‌ల నుంచి, నాకు తెలిసిన బంధువుల‌ నుంచి, ఎన్‌టిఆర్ అభిమానుల నుంచి చాలా ఫోన్లు వ‌చ్చాయి. వారంతా ఒక్కటే మాట‌.. బాగా తీశార‌ని కితాబిచ్చారు. 
 
అయితే సినిమా రివ్యూల‌ను రాసేవారు.. కొంద‌రు ఒక విష‌యాన్ని ట‌చ్ చేశారు. నేచ‌ర్ ల‌వ‌ర్‌... మ‌ర‌ద‌లును ప్రేమించ‌డం క‌రెక్ట్‌కాద‌ని అన్నారు. దానివ‌ల్ల జ‌నెటిక్ ప్రాబ్లం వ‌స్తుంద‌ని రాశారు. నేను అంత‌గా ఆలోచించ‌లేదు. ఈ విష‌యంలో నా ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాన‌ని అన్నారు. ఈ సినిమాను 2 వేల థియేటర్లలో విడుద‌ల చేశాం. ఓవ‌ర్‌సీస్‌లో 'శ్రీ‌మంతుడు'ను బ్రేక్ చేసింద‌ని తెలిపారు. 
 
సినిమాను కొన్న బ‌య్యర్లు చాలా హ్యాపీగా వున్నారు. వారి కాంప్లిమెంట్‌కు షాక్ అయ్యాను. సందేశంతోపాటు క‌మ‌ర్షియ‌ల్‌గా తీసినా మంచి సినిమా తీశార‌ని చెబుతుండే ఆనందం క‌ల్గింద‌ని చెప్పారు. ముందుగా క‌థ‌ను విన్నప్పుడు ఎంత ఆనందించాల‌రో ఎన్‌టిఆర్‌.. సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాత కూడా అలానే వున్నార‌ని చెప్పారు. మోహ‌న్‌లాల్‌, ఎన్‌టిఆర్ పోటీప‌డి న‌టించార‌ని ఎవ‌రు గొప్ప అనేది క‌న‌బ‌డ‌లేద‌ని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments