Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచితే అంద‌రూ బావుంటారుః చిరంజీవి

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (23:11 IST)
Venky-chiru
నా యుద్ధభూమి నిర్మాత కృష్ణ‌మూర్తిగారికి ముందుగా నివాళులు అర్పిస్తున్నాను. 1996లో శ్రీకాంత్ హీరోగా చేసిన ‘పెళ్లి సంద‌డి’ సినిమా 175 రోజుల ఈవెంట్.  విజ‌యవాడ‌లో జ‌రిగిన‌ప్పుడు దానికి నేనే చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అప్పుడు నా సినిమాలు నాలుగు వ‌రుస‌గా స‌క్సెస్ కాలేదు. దాంతో నేను కాస్త లో(డ‌ల్‌), లో ఉన్నాను. కానీ ప్రేక్ష‌కులు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు చూసిన త‌ర్వాత నాలో తెలియ‌ని ఉత్సాహం వ‌చ్చేసింది` అని చిరంజీవి అన్నారు. రోష‌న్ హీరోగా న‌టించిన పెళ్లిసంద‌డి వేడుక‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను మాట్లాడారు. 
 
ఇంకా చిరు మాట్లాడుతూ, `నువ్వు కాస్త డ‌ల్‌గా ఉన్నావ‌నిపించింది. అందుక‌నే నిన్ను ఇక్క‌డ‌కు తీసుకొస్తే బావుంటుంద‌నిపించిద‌ని రాఘ‌వేంద్ర‌రావుగారు అన్న‌ప్పుడు నాలో తెలియ‌ని ఓ జోష్ వ‌చ్చింది. ఆ జోష్ త‌గ్గ‌లేదు. పాతికేళ్ల త‌ర్వాత మ‌రోసారి ఆయ‌న న‌న్ను ఈ పెళ్లి సంద‌డి సినిమాకు ఆహ్వానించి అదే ప్రేమానురాగాలు, ఆప్యాయ‌త‌ను చూపించారు. అభిమానులంద‌రి రుణం తీర్చుకోలేనిది. రాఘ‌వేంద్ర‌రావుగారితో నా అనుబంధం చెప్ప‌లేనిది. అప్ప‌ట్లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తే కానీ, ఓ సుస్థిర‌స్థానం ఉండ‌దు అనుకునేవాళ్లం. ఆయ‌న‌తో సినిమాలు చేసేవాళ్లం. అది ఆయ‌న మాకు ఇచ్చిన భ‌రోసా. కెరీర్ స్టార్టింగ్‌లో మోస‌గాడు అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను. కానీ, పూర్తిస్థాయి పాత్ర కావాల‌ని అనుకున్నాను. అప్పుడు 1995లో అడ‌విదొంగ సినిమా చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఎలాంటి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే. 
 
నా చిర‌కాల మిత్రుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ వేడుక‌కి రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. హీరోలంద‌రి మ‌ధ్య‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటే ఇండ‌స్ట్రీలో ఇలా కొట్టుకోవ‌డాలు, మాట‌ల‌న‌టం, మాట‌ల‌నిపించుకోవ‌డం ఉండ‌దు క‌దా. ప‌ద‌వులు ఏదైనా తాత్కాలిక‌మే. వాటి కోసం మాట‌లు అన‌డం, అనిపించుకోవ‌డం.. చూస్తుంటే బాధ‌నిపిస్తుంది. అదెవ‌రైనా కానీ. నేను ఏ ఒక్క‌రినీ వేలు పెట్టి చూపించాల‌నుకోవ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ విజ్ఞ‌త‌తో ఉండండి. మ‌న ఆదిప‌త్యం చూపించుకోవ‌డానికి, ప్ర‌భావాన్ని చూపించుకోవ‌డానికి ఎదుటి వారిని కించ‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ను ఎక్క‌డ స్టార్ట్ అయ్యింది. వివాదాలు ఎక్క‌డ స్టార్ట్ అయ్యాయో తెలుసుకుని హోమియోప‌తి వైద్యంలా మూలాల్లోకి వెళ్లి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అలాంటి వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచితే అంద‌రూ బావుంటారు. అప్పుడది వ‌సుధైక కుటుంబం అవుతుంది. ఈ ‘పెళ్లి సంద‌D’ నాటి ‘పెళ్లి సంద‌డి’లా గొప్ప‌గా ఆడాల‌ని, ఆడుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments