Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (17:04 IST)
దర్శక రచయితలు కాగితంపై రాసిచ్చినదాన్ని తెరపై ఒక నటిగా ఆవిష్కరించానని జాతీయ అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్ అన్నారు. ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రాంబలం చిత్రానికిగాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది. దీనిపై ఆమె తన స్పందనను గురువారం ఓ ఆడియో రూపంలో తెలియజేశారు. ఈ అవార్డు కేవలం తిరుచిట్రాంబలం చిత్రంలోని పాత్రకు మాత్రమే కాదనని, అనేక చిత్రాల్లోని తన నటనకు గుర్తింపుగా లభించిందన్నారు. 
 
'ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం. దాన్ని స్వీకరించిన వెంటనే పలువురు జ్యూరీ సభ్యులను కలిశా. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడడం కొత్త అనుభూతి. ఈ అవార్డు ఈ ఒక్క సినిమా (తిరుచిట్రాంబలం)కే కాదు, ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలన్నింటికీ దక్కుతుంది. తిరులోని శోభన పాత్ర పోషించడం తేలిక కాదని ధనుష్‌ సినిమా ప్రారంభానికి ముందు చెప్పారు. ఆ రోల్‌ నాకు పూర్తి భిన్నమైంది. కానీ, దర్శక- రచయితలు కాగితంపై ఏం రాస్తారో.. దాన్ని తెరపై ఓ నటిగా ఆవిష్కరించా. మూస ధోరణికి భిన్నమైన ఆ పాత్రకు అవార్డుకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇంటెన్స్‌ యాక్టింగ్‌, మూవీస్‌కు అవార్డులు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. అది అవాస్తవం' అని పేర్కొన్నారు.
 
కాగా, ప్రస్తుతం తన చేతిలో పాండిరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటివరకూ నేను నటించని కొత్త జానర్‌లో అది రూపొందుతోంది. ఈ యేడాది చివరిలో గోల్డెన్‌ వీసా సినిమా ప్రారంభం కానుంది. కాదలిక్కా నేరమిల్లై (తమిళ్‌) షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే విడుదల కానుంది అని ఆమె వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments