Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్‌కి 'నేషనల్ అవార్డ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ 2023-24 రికగ్నిషన్ ప్రోగ్రామ్'లో సిల్వర్‌

image

ఐవీఆర్

, గురువారం, 29 ఆగస్టు 2024 (18:52 IST)
'నేషనల్ అవార్డ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ 2023-24 రికగ్నిషన్ ప్రోగ్రామ్' వద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ విభాగంలో సిల్వర్ అవార్డుతో తాము గౌరవించబడ్డామని వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ వెల్లడించింది. తయారీ ప్రక్రియల్లో ఆవిష్కరణ, కార్యాచరణ శ్రేష్ఠత మరియు నాణ్యతను నిరంతరం కొనసాగించడంలో నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం.
 
కాస్ట్ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మెరుగుదల, లీడ్ టైమ్ మేనేజ్‌మెంట్, ప్రతిభను ప్రోత్సహించటం వంటి విభాగాలలో వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ యొక్క అత్యుత్తమ ప్రయత్నాలను నేషనల్ అవార్డ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ బృందం గుర్తించింది. తయారీలో శ్రేష్ఠత పట్ల వారి అచంచలమైన నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. దేశవ్యాప్తంగా 19కు పైగా రాష్ట్రాలలో 1000కి పైగా కర్మాగారాలను పరిశీలించి ఈ అవార్డు అందించారు. నివాస, వాణిజ్య కార్యాలయ స్థలాలు, హోటళ్లు, మరిన్నింటికి వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ ప్రాధాన్య ఫ్లోరింగ్ పరిష్కారం అని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుంది.
 
భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అత్యాధునిక జాతీయ ప్రాజెక్ట్, ‘భారత్ మండపం’ కోసం అత్యుత్తమ-శ్రేణి  ఫ్లోరింగ్ పరిష్కారాలను వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్  అందించింది. ఇది బిఎఫ్ఎస్ఐ, సాంకేతిక, ఆతిధ్య  రంగాలలోని పలు ప్రముఖ భారతీయ, బహుళజాతి కంపెనీలకు ప్రాధాన్య ఫ్లోరింగ్ సొల్యూషన్స్ ప్రదాతగా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ యొక్క పరిశ్రమలోని ఉత్తమ పరిష్కారాలను కూడా కలిగి ఉన్నాయి.
 
"ఆవిష్కరణ, శ్రేష్ఠత పట్ల మా మహోన్నత నిబద్ధతకు గుర్తింపు పొందడం చాలా ఆనందంగా వుంది" అని వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ ప్రతినిధి అన్నారు. "ఈ గుర్తింపుతో, మా వినియోగదారుల ప్రాంగణాలను  మరింత సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా  మరియు అందంగా మా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫ్లోరింగ్ సొల్యూషన్స్‌తో మార్చడానికి  మేము స్థిరంగా ఉన్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను ఆర్కే రోజా అన్‌ఫాలో కాలేదు.. జగన్‌ను ఇప్పటికీ అన్నగానే..?