Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ రెడీ... పూరి ప్లాన్ వ‌ర్కవుట్ అవుతుందా..?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (19:58 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రానికి  డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టించారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యాన‌ర్స్ పైన పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చాలా స్పీడుగా జ‌రుగుతున్నాయి. 
 
ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ లుక్ కొత్త‌గా ఉండ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం అందిస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే..త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ ట్రైల‌ర్ కోసం పూరి హోమ్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. పూరి ఏంటి ట్రైల‌ర్ కోసం హోమ్ వ‌ర్క్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా...? మ్యాట‌ర్ ఏంటంటే... సినిమా ఎలా ఉండ‌బోతుందో చెప్పేది ట్రైల‌ర్. అందుచేత ట్రైల‌ర్‌తో అంచ‌నాలు రెట్టింపు చేసేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట పూరి. ఇందులో అస‌లు సినిమా ఎలా ఉండ‌బోతుందా క్లియ‌ర్‌గా చెప్పేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి.. పూరి ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా. అంచ‌నాలు పెరుగుతాయా..? ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments