Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.జి.ఎఫ్‌.2లో సంజ‌య్ ద‌త్ హైలైట్ అవుతున్నాడా!

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:01 IST)
Sanjay Dutt, sai kurrapati, Shivraj Kumar
రాకింగ్  స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కె.జి.ఎఫ్‌.ఛాప్టర్ 2’  ఇటీవ‌లే బెంగుళూరులో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ, క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఏప్రిల్ 14న తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది.
 
కాగా, ట్రైల‌ర్‌లో హీరో య‌ష్‌.. వైలెన్స్‌..వైలెన్స్‌.. అంటూ బ‌ట్ల‌ర్ ఇంగ్లీషులో కూల్‌గా మాట్లాడుతూనే ఐ డోంట్ వైల‌న్స్‌.. బ‌ట్‌.. వైలెన్స్ లైక్స్ మీ.. అన్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన కొన్ని స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. ర‌వీనాటాండ‌న్‌, రావు ర‌మేష్, ప్ర‌కాష్ రాజ్ డైలాగ్స్ ఆస‌క్తిగా వున్నాయి. ఇక వీట‌న్నింటికి మించి బాలీవుడ్ ఖ‌ల్ నాయ‌క్ సంజ‌య్ ద‌త్ పాత్ర వుంది. అధీర‌గా ఆయ‌న ఆహార్యం, న‌డ‌క‌, డైలాగ్ డెలివ‌రీ ఆయ‌న‌లో క్రూర‌త్వానికి ప్ర‌తీక‌గా వున్నాయి. 
 
అయితే ట్రైల‌ర్ మొత్తం ప‌రిశీలిస్తే సంజ‌య్ హైలైట్‌గా నిలిచాడ‌ని టాక్ నెల‌కొంది. మ‌రి సినిమా అంతా చూస్తేకానీ ఏ మేర‌కు అనేది తెలియ‌దు. ట్రైల‌ర్ అనంత‌రం సంజ‌య్‌ద‌త్‌తో క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ మాట్లాడుతున్న స్టిల్ ఆస‌క్తిగా మారింది. సంజ‌య్ పాత్ర‌ను ఆయ‌న అభినందించిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో తెలుగులో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ సాయి కొర్ర‌పాటి వారి మాట‌ల‌ను ఆస‌క్తిగా వింటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments