Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సీ పన్ను మిషన్ ఇంపాజిబుల్ కోసం నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:41 IST)
Naveen Polisetti voice over
టాలీవుడ్  ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ త‌న‌ తదుపరి  చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`ను నిర్మించింది.  చాలా కాలం విరామం త‌ర్వాత తెలుగులో తాప్సీ పన్నుకు ఈ చిత్రం పునఃప్రవేశాన్ని క‌ల్గించింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
ఈ చిత్రం హై ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని ఊహించ‌ని ట్విస్ట్‌లు,  క‌థ‌నంలో వ‌చ్చే మ‌లుపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి.  కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అదనపు బోనస్ అవుతుంది. విడుదలకు ముందే ట్రైల‌ర్‌, టీజ‌ర్‌కు  అద్భుతమైన స్పంద‌న అందుకున్న ఈ చిత్రం మ‌రింత హైప్ క్రియేట్ చేసింది.
 
న‌మ్మ‌శ‌క్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన, టేకింగ్‌తో కమర్షియల్ హంగులు జోడించి ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తోవుంటూ యాక్షన్, థ్రిల్లింగ్‌తో కూడిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
 
దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.
వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిష‌న్ ఇంపాజిబుల్` ఏప్రిల్ 1న థియేటర్‌లలో అలరించనుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments