Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ... ఇంత నీచానికి దిగజారుతారా? సాయిపల్లవి మండిపాటు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (20:24 IST)
తాను రహస్యంగా ఓ దర్శకుడిని పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై హీరోయిన్ సాయిపల్లవి స్పందించారు. ఛీ.. ఇంత నీచానికి దిగజారుతారా అని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ఓ పోస్ట్ చేశారు. 
 
సాధారణంగా తనపై వచ్చే పుకార్లను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తుంది. తాను నటించిన ఓ చిత్ర పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను క్రాప్ చేసి, డబ్బు కోసం నీచమైన ఉద్దేశాలతో వాటిని ప్రచారం చేస్తున్నారన్నారు. 
 
తన సినిమాలకు సంబంధించి మంచి అప్‌డేట్స్ పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించాల్సి రావడం నిజంగా చాలా బాధగా ఉందన్నారు. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యే అని సాయిపల్లవి అసహనం వ్యక్తం చేశారు.
 
కాగా, సాయిపల్లవికి సంబంధించిన ఓ ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో ఆమె ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సాయిపల్లవి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతనేంటూ నెటిజన్లు ప్రచారం చేసుతున్నారు. 'శివకార్తికేయన్ 21'వ చిత్రం పూజా కార్యక్రమంలో దర్శకుడు పక్కన సాయిపల్లవి నిల్చోగా, పూజారి వారిద్దరితో పాటు పూజలో పాల్గొన్న ఇతర సభ్యులకు కూడా పూలదండలు వేశారు. అయితే, దర్శకుడు, సాయిపల్లవి ఉన్న ఫోటోను మాత్రం క్రాప్ చేసి వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం చేశారు. దీనిపై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments