Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక రోజుల మనిషేనట...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక రోజులు మనిషేనట. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందట. న్యూరోఎండోక్రైన్ అనే అరుదైన ట్యూమర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్... ప్రస్తుతం అమెరి

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:53 IST)
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక రోజులు మనిషేనట. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందట. న్యూరోఎండోక్రైన్ అనే అరుదైన ట్యూమర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్... ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ అరుదైన వ్యాధికి చికిత్స ఉందని.. సర్జరీతో నయమవుతుందని అమెరికాలోని డాక్టర్లు వెల్లడించారు. కానీ ఇర్ఫాన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
 
దాదాపు నెల రోజుల క్రితం తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. దాని నుంచి బయటపడేందుకు ఫైట్ చేస్తున్నానని.. త్వరలోనే విజేతగా తిరిగి వస్తానని.. అప్పటివరకూ తను కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా అభిమానులను ఇర్ఫాన్ ఖాన్ కోరిన విషయం తెల్సిందే. అయితే, చికిత్స నిమిత్తం ఇర్ఫాన్ వెళ్లి నెల రోజులు కావొస్తున్నా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదు. 
 
ఇర్ఫాన్ భార్య కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తాము కాల్స్‌కి, మెసేజ్‌లకి స్పందించే పరిస్థితిలో లేమని అభిమానులు, శ్రేయోభిలాషులు క్షమించాలని కోరారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నటించిన బ్లాక్‌మెయిల్ మూవీ సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments