Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధర్వ నుంచి ఐరా లుక్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (16:50 IST)
Ira - Adharva
ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో అధర్వ చిత్రం రూపొందుతోంది. హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో న‌టిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో అదే జోష్‌లో తాజాగా ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ కన్ఫమ్ చేయగా.. ఇప్పుడు ఐరా లుక్‌తో గ్లామర్ టచ్ కూడా ఉంటుందని,  ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని స్పష్టం చేస్తోంది.  
 
‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఈ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చెప్పేశాయి. 
 
డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments