అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

డీవీ
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (18:18 IST)
Sai Pallavi
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు.
 
ఇందు రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవిని పరిచయం చేస్తూ, మేకర్స్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ఇది ముకుంద్, ఇందుల ఎమోషనల్ జర్నీని అద్భుతమైన గ్లింప్స్ గా ప్రజెంట్ చేస్తోంది. రిపబ్లిక్ డే పరేడ్ సీక్వెన్స్ తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ US ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు ముకుంద్‌ను సత్కరిస్తున్న రియల్ ఫుటేజీని ప్రజెంట్ చేయడం మనసుని హత్తుకుంది.
 
ఇందు పాత్రలో సాయి పల్లవి కట్టిపడేసింది. తన ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్ తో ఇందు క్యారెక్టర్ కు అథెంటిసిటీ తీసుకొచ్చింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇంట్రో వీడియో ప్రధానంగా సాయి పల్లవి క్యారెక్టర్ పై ఫోకస్ చేసింది.
 
టాప్  టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లు గా వున్నారు.
 
ఈ మూవీ శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు.
 
అమరన్ ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: 24మంది మృతి- తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం (video)

Beaver Moon 2025: నవంబరులో సూపర్‌మూన్ ఎప్పుడొస్తుందంటే?

భర్త ఆమెకు భరణం ఇవ్వనక్కర్లేదు.. ఉద్యోగం చేసుకుని బతకగలదు.. తెలంగాణ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments