Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల‌జ‌డి సృష్టిస్తున్నఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియో

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (13:54 IST)
krishna lanka
ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు పరుచూరు రవితోపాటు నరేష్ మేడి, ఆదర్శ్,పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ న‌టిస్తున్నచిత్రం `కృష్ణలంక`. `రంగు` ఫేమ్ కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత పూనా సోహ్లా పుట్టినరోజు సంద‌ర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియోని విడుద‌ల చేశారు. టీజ‌ర్ లు, ట్రైల‌ర్ ల‌కు భిన్నంగా ప్ర‌తి క్యారెక్ట‌ర్ఎమోష‌న్ ని ప‌లికించిన ఈ మూడు నిముషాల వీడియోలో అన్ని పాత్ర‌లు తీరు తెన్నుల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు. సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కార్తికేయ మాట్లాడుతూః ఇది ఎమోష‌న‌ల్ క్రైమ్ డ్రామా. ప్రేమ‌, స్నేహాం, ప‌గ వంటి భావోద్వేగాల‌తో న‌డిచే ఈక‌థ‌లో ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. చాలా రియ‌లిస్టిక్ గా క‌థ‌నం ఉంటుంది. హీరోయిన్  క్యాట‌లిన్ పాత్ర  చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్ట‌ర్ చుట్టూ క‌థ‌నం సాగుతుంది. ఇందులో హీరోలుగా చేసిన న‌రేష్, ఆద‌ర్శ్ పెద్దిరాజు పాత్ర‌లు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ప‌రుచూరి ర‌వి  పాత్రలో ఉండే మాస్ అప్పీల్ క‌థ‌, క‌థ‌నాలు చాలా రియ‌లిస్టిక్ గా ఉంటాయి. ప‌రిచూరి బ్ర‌ద‌ర్స్ నాకు గాఢ్ పాద‌ర్ లాంటి వారు. కొన్ని డైలాగ్స్ వారు మాత్ర‌మే రాయ‌గ‌ల‌రు అనేంత‌గా వ‌చ్చాయి. కృష్ణ‌లంక  ప్ర‌తి ఎమోష‌న్ ని పీక్స్ లో చూపిస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.
 
నిర్మాత పూనా సోహ్లా మాట్లాడుతూ, సినిమా మా అంచ‌నాల‌ను మించి వ‌చ్చింది. ఒక మంచి సినిమాను నిర్మించామ‌న్న సంతృప్తి ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాము. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చ‌క్క బ‌డిన త‌ర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు.
మ‌రో నిర్మాత చేత‌న్ మాట్లాడుతూ, కార్తికేయ క‌థ‌ను డీల్ చేసిన విధానం మాకు బాగా న‌చ్చింది. క‌థ‌లోని భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. కృష్ణ‌లంక సినిమా నిర్మించాక  తెలుగులో మ‌రిన్ని సినిమాలు తీయాల‌నిపిస్తుంది అన్నారు..
 
సినిమాటోగ్ర‌ఫీ  ః శ్రీమాన్ నారాయ‌ణ‌, ఎడిట‌ర్ః  కుమార్ తేజ‌, సంగీతంః కృష్ణ సౌర‌భ్ సూరం ప‌ల్లి, సంభాష‌ణ‌లుః ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః సూర్య  సూర్యాని. కథ, కథనం, ద‌ర్శ‌క‌త్వం ః వి.కార్తికేయ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments