Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీజీ, ప‌టేల్ ముస‌లోళ్లు కాదు వ‌య‌స్సు వ‌చ్చిందంటే..

గాంధీజీ, ప‌టేల్ ముస‌లోళ్లు కాదు వ‌య‌స్సు వ‌చ్చిందంటే..
, శనివారం, 26 డిశెంబరు 2020 (22:06 IST)
మామూలుగా పరుచూరి బ్రదర్స్‌కు వయసు వచ్చేసింది అంటే గౌరవంగా ఉంటుంది. ముసలోడు అయ్యాడు అంటే తక్కువగా ఉంటుంది. కానీ కర్ర పట్టుకున్న గాంధీజీ గారే కదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వారందరూ వయసువారే. ప్రతి మనిషి 50 నుండి 60 సంవత్సరాల వరకు డబ్బుకు డబ్బు కోసం తపన పడి, డబ్బు సంపాదిస్తాడు.
 
60 సంవత్సరాల తర్వాత కీర్తి కోసం తపిస్తాడు.. అలాగే నాకు కార్తికేయ లాంటి వాడు దొరికితే సినిమా తీయడానికి ముందుకు వస్తాను. చిరంజీవి గారు కూడా ఎంతోమందికి అవకాశం కల్పించాడు. చిరంజీవి గారి ఖైదీకు రాసినప్పుడు ఆ రోజుల్లో కష్టమనిపించలేదు. ఇప్పుడు కూడా నాపై నమ్మకంతో చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి చేయించారు. అలాగే కార్తికేయ చూస్తుంటే అతను ఐదు అడుగులు హైట్ ఉన్నా ఆలోచనలు మాత్రం పది అడుగుల ఉంటాయి. 
 
ఆ లెవెల్లో ఆలోచిస్తాడు. రంగు సినిమా ద్వారా మనిషిలో ఎన్ని రంగులు ఉంటాయో, చెప్పడానికి సినిమా అద్భుతంగా తీశాడు. రంగు సినిమా ఎంత ఆదరాభిమానాలు పొందిందో ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఆదరణ పొంది, దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు.
 
దర్శకుడు కార్తికేయ. వి. మాట్లాడుతూ.. రంగు సినిమా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. దాని లాగే ఈ కృష్ణలంక సినిమా కూడా కొత్త రకమైన విజువల్స్‌తో, కొత్త రకమైన షాట్స్‌తో, కొత్త రకమైన ఎడిటింగ్ ట్రాన్సక్షన్‌తో, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటూనే కరెంట్ అఫైర్స్‌ను డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా చేస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తకొత్తగా చూపించగలమని అని నమ్ముతున్నాను. నాపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్య మాట్లాడుతూ, ఈ కృష్ణలంక చిత్రాన్ని కార్తికేయపై నమ్మకంతో బడ్జెట్లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము. జనవరి 22న షూటింగ్ స్టార్ట్ చేసి 3 షెడ్యూళ్లలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
 
నిర్మాతలు  మాట్లాడుతూ, కార్తికేయ మాకు రంగు సినిమా నుంచి తెలుసు. మేము తీస్తున్న ఈ కృష్ణలంక సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి స్పూర్తితో సినిమా చేశానంటున్న జీఎఫ్ హీరో