Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్ నేపథ్యంలో ఇంటింటి రామాయణం రాబోతుంది

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (15:40 IST)
intinti Ramayanam crew
ఆహాకు తోడుగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చేతులు క‌లిపి  రూపొందిన తెలుగు ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఆహాలో డిసెంబ‌ర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ టీజ‌ర్‌ను ఆహా విడుద‌ల చేశారు. ప్ర‌తిరోజూ పండగే, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.
 
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఆహాలో ఇంతకు ముందు ‘త్రీ రోజెస్’ను రూపొందించిన సంగతి తెలిసిందే.  అదే అనుబంధంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ ఇంటింటి రామాయ‌ణంను రూపొందించాం. ఈ క‌థ మీ హృద‌యానికి హ‌త్తుకోవ‌ట‌మే కాదు.. మీరు ప్రేమించ‌న వ్య‌క్తులో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను గుర్తుకు తెస్తుంది. నేటి రోజుల్లో మ‌న వ్య‌క్తిగ‌త జీవితాల్లోని భావోద్వేగాల‌ను ఎమోజీల రూపంలో వ్య‌క్తం చేస్తున్నాం. కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయ‌ణం సినిమాను వీక్షించిన‌ప్పుడు మీ ఇంటి స‌భ్యుల‌కు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఒక‌వేళ వారు ఇత‌ర ప్రాంతాల్లో ఉంటే వెంట‌నే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని క‌లుసుకోవాల‌నే కోరిక క‌లుగుతుంది. అంత స‌ర‌ళంగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఉండ‌ట‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం’’ 
 
మనం ఇది వరకు చూసి గ్రామీణ మధ్య తరగతి జీవిత కథలను ప్రతిబింబించే సినిమాయే ఇంటింటి రామాయణం. కరీంనగర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. అక్కడ గ్రామంలో ఉండే రాములు (నరేష్).. అతని  పక్క నుండే కుటుంబం ఓ సమస్యను ఎదుర్కొంటుంది. దీంతో వారిలో ఒకరినొకరు అనుమానపడతారు. అలాంటి సమయంలో వారిలోని భావోద్వేగాలు ఎలా ఉంటాయి. అవి వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేదే ప్రధాన కథాంశం  అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments