Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తి రేకెత్తిస్తున్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు టీజర్

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (16:16 IST)
Laksha Chadalavada, Venue Dutta
హీరో లక్ష్  మరికొద్ది రోజుల్లో 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.  తాజాగా కొత్త సంవత్సర కానుకగా గ్యాంగ్‌స్టర్ గంగరాజు టీజర్ రిలీజ్ చేశారు.
 
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించింది. 'అదిగదిగో మన గ్యాంగ్‌స్టర్ గంగరాజు రానే వచ్చాడు' అంటూ హీరో లక్ష్ ఇంట్రో సీన్ అదిరింది. ఈ సినిమాతో విలన్‌గా పరిచయమవుతున్న స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ త‌న‌యుడు నిహార్‌ కపూర్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని తెలుస్తోంది. ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో ప్రతి సన్నివేశం, విజువలైజేషన్ ఆకట్టుకుంటున్నాయి. సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో కీలక భూమిక పోషించింది. ఇక వీడియో చివరలో  'టైటిల్ దుమ్మురేపింది' అని వెన్నెల కిషోర్ చెప్పడం, 'స్టోరీ నా దుమ్ము రేపింది' అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పడం హైలైట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే లవ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ కలగలిపి ఈ సినిమా రూపొందించారని స్పష్టమవుతోంది. 
 
గతంలో ఎన్నడూచూడని ఆసక్తికర కథతో ఈ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' మూవీ రూపొందుతోందని,  గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలు కట్టగా.. వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments