Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో ధోనీ సినిమాపై నిషేధం.. కాశ్మీర్‌పై పరిష్కారం.. పాక్‌లో నో ఇండియన్ సినిమా

యూరీ ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల వార్ జరుగుతున్న సమయంలో.. పాకిస్థాన్ నటులు భారత్‌ను వీడిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ అందరినీ సమానంగా ఆదర

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:16 IST)
యూరీ ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల వార్ జరుగుతున్న సమయంలో.. పాకిస్థాన్ నటులు భారత్‌ను వీడిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ అందరినీ సమానంగా ఆదరిస్తుందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఈ పిలుపును పాకిస్థాన్ సీరియస్‌గా తీసుకుంది. గతంలో భారత సినిమాల్లో కొన్నింటిపై నిషేధం విధించిన పాకిస్థాన్ తాజాగా యూరీ ఘటన తరుణంలో భారతీయ సినిమా అయిన ధోనీపై నిషేధం విధించింది. తద్వారా పాకిస్థాన్‌కు ఇదేమీ కొత్త కాదని నిరూపించింది. 
 
ఒక్క ధోనీ సినిమానే కాదు.. ఇకపై ఏ భారతీయ సినిమాలను పాకిస్థాన్‌లోని థియేటర్లలో ఆడనివ్వకుండా నిషేధం విధించింది. భారత క్రికెట్ దిగ్గజం ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ''ఎం.ఎస్‌.ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ'' సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోపాకిస్థాన్‌కు చెందిన ఐఎమ్‌జీసీ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ ఈ చిత్రాన్ని ఆ దేశంలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అయితే పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంతో సదరు సంస్థ ఈ సినిమాను విడుదల చేయడంలో వెనక్కి తగ్గింది. 
 
అంతేగాకుండా కాశ్మీర్ వివాదం పరిష్కారం అయ్యేదాకా భారతీయ చిత్రాలపై పాకిస్థాన్‌ నిషేధం విధించాలని సెప్టెంబర్ 23న లాహోర్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ దాఖలు చేసిన లాయర్ అజహర్ సిద్ధిఖీ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా బాలీవుడ్ సినిమాలను రూపొందిస్తున్నారని చెప్పారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments