Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా, రణ్‌బీర్ కలిసి లిప్ట్‌లో ఇరుక్కుపోతే.. నా ప్రాణం నేనే తీసుకుంటా: కరీనా

బాలీవుడ్ హాట్ జంట రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ విడిపోయారు. ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇక పెళ్లి పీటలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు బాలీవుడ్‌లో గుప్పుమన్నాయి. ఇద్ద

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:52 IST)
బాలీవుడ్ హాట్ జంట రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ విడిపోయారు. ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇక పెళ్లి పీటలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు బాలీవుడ్‌లో గుప్పుమన్నాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం మాత్రం ఇద్దరూ బహిర్గతంగా చెప్పలేదు. ఇద్దరి మధ్య మాటల్లేకపోయినా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీరిద్దరు మళ్లీ కలుసుకోవాలని అభిమానులతో పాటు సినీనటులు కూడా కోరుకుంటున్నారు. కరీనా కూడా ఈ జంట తిరిగి కలుసుకోవాలని ఆశపడుతోందట. 
 
రణబీర్‌కి కరీనా అక్క అనే సంగతి తెలిసిందే. రణ్‌బీర్, కత్రినా విడిపోయినప్పుడు ఎలాగైనా వారికి నచ్చజెప్పి వారిని కలపాలని కరీనా భావించిందట. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. కాగా కరీనా ఇటీవల వోగ్‌ బీఎఫ్‌ఎఫ్‌ చాట్‌లో మాట్లాడుతూ...''రణబీర్, కత్రినా జంట చాలా బాగుంటుంది.. కత్రినా నా తమ్ముడికి తగిన జోడీ.. వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకుంటే చాలా బాగుంటుంది'' అని బహిరంగంగానే అన్నారు. 
 
ఈ జంటను కలపడానికి కరీనా తీవ్రంగా ప్రయత్నిస్తుందట. ఆ చాట్‌లో భాగంగా... ఒకవేళ మీరు కత్రినా, రణ్‌బీర్‌తో కలిసి లిఫ్ట్‌లో వెళ్తూ ఇరుక్కుపోతే ఏం చేస్తారు అని అడగ్గా.. అదే జరిగితే నా ప్రాణం నేనే తీసుకుంటాను అని సమాధానమిచ్చింది కరీనా. రణ్‌బీర్‌, కత్రినాలు రిలేషన్‌షిప్‌లోఉన్నప్పుడు కరీనా, కత్రినాలు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉండేవారు. కరణ్‌ జోహార్‌ టీవీ షో ''కాఫీ విత్‌ కరణ్''’కి కరీనా, రణ్‌బీర్‌లు వచ్చినప్పుడు కత్రినాని నా మరదలు అని సంబోధిస్తూ రణ్‌బీర్‌ని ఏడిపించిందట. ఇప్పుడు వారిద్దరు ఎవరి దారి వారు చూసుకోవడంతో ఇద్దరి మధ్య అంత మాటలు కూడా లేవని కరీనా వాపోయింది.

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments