Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి, సుకుమార్ బాట‌లోనే కార్తికేయ-2 తీసి వందకోట్లలో చేరాం

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (12:51 IST)
100 club poster
హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా  వచ్చిన  కార్తికేయ‌ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్ లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం కేవలం మౌత్ టాక్ తో అనేక థియేటర్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది.
 
దర్శకుడు చందు మొండేటి తెలుపుతూ,  సాంకేతిక నిపుణులకు, నిర్మాతలు , ఆర్టిస్టు లు గురించి చాలాసార్లు మాట్లాడాను. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన  నా తల్లి తండ్రులకి, కొడుకుల చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదలు. ఈరోజు నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
 
Kartikeya function
హీరో నిఖిల్ మాట్లాడుతూ,  రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగాము, ఈ రోజు 1200 స్క్రీన్ లలో కార్తికేయ ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం. మీరు ఈ సినిమాను చూసి హిట్ చేసారు అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరికి థాంక్యూ సో మచ్. నన్ను  ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ఫీల్ ఈ సినిమాను జనాల్లోకి మీరు తీసుకెళ్లారు. మా నిర్మాతలకి , మా దర్శకుడు చందు కి థాంక్యూ సో మచ్.
 
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ,  మాకు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి, నిఖిల్ కి, అనుపమకు, అలానే డిస్ట్బ్యూటర్స్ అందరికి చాలా పెద్ద థాంక్స్.  
 
సహా నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ,హీరో హీరోయిన్ కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ లా కష్టపడ్డారు. సినిమాలో ఎంత సస్పెన్స్ ఉందొ మాకు అలానే సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు. చాలా హ్యాపీగా ఉంది.  
 
నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ,  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది మొదటి వంద కోట్ల మూవీ మూవీ. మీడియాకు, హీరో నిఖిల్ కి, దర్శకుడు చందు మొండేటికి పతి ఒక్కరికి థాంక్స్.
 
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు తరువాత ఈ సినిమా నాకు  మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు ఇచ్చిన ప్రేమ మాత్రం నాకు చాలా విలువైంది. మా టీం కి కంగ్రాట్స్ చెబుతున్నాను. థాంక్యూ అల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments